ప్రకాశం: పామూరు పట్టణంలో కొలువైన శ్రీవల్లి సమేత భుజంగేశ్వర స్వామి ఆలయానికి కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ భుజంగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీకదీపాలను వెలిగించి, మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఆశీర్వచనాలు అందజేసిన పండితులు స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.