AP: రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్న్యూస్ చెప్పారు. ఈనెల 19న ‘అన్నదాత సుఖీభవ’ పథకం నిధులు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే రోజు PM కిసాన్ నిధులు కూడా జమ కానున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. NPCAలో ఇన్ యాక్టివ్గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలని అధికారులకు సూచించారు.