MBNR: జడ్చర్ల పట్టణం క్లబ్ రోడ్లోని కువాతుల్ ఇస్లాం మజీద్లో రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా సోమవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అల్లా ఆశీస్సులు అందరిపైనా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే రంజాన్ మాసం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.