TG: హైదరాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్పై గిరిజన గౌరవ దినోత్సవ ర్యాలీ చేశారు. వివేకానంద విగ్రహం నుంచి కొమురం భీం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సావిత్రి ఠాకూర్, రాష్ట్ర BJP అధ్యక్షుడు రాంచందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన గిరిజన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.