SRPT: మత్స్యకారులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకుని, ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న వేడుకలకు సంబంధించి, రూపొందించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.