NLG: పోలీసులకు విధి నిర్వహణతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో క్షయ నివారణ కేంద్రం సహకారంతో ఆధునిక AI టెక్నాలజీతో కూడిన ఎక్స్-రే స్కానింగ్ మరియు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఇటువంటి ఆధునిక టెక్నాలజీతో శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.