W.G: వసతి గృహాల్లో గతంలో కన్నా మెరుగైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని భీమవరం 1వ అదనపు సివిల్ జడ్జి హనీష అన్నారు. శుక్రవారం భీమవరం నరసయ్య అగ్రహారంలోని బాలుర వసతి గృహాన్ని పరిశీలించి న్యాయ అవగాహనా సదస్సు నిర్వహించారు. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ కలిగి అవకాశాలను అందిపుచ్చుకుని లక్ష్యాలను సాధించాలన్నారు. అందుకోసం నిరంతరం శ్రమించాలన్నారు