NGKL: వంగూరు మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్. యశ్వంత్ రావు శుక్రవారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎరువుల దుకాణాల యజమానులు నిబంధనలు పాటించాలని సూచించారు. రైతులు కొనుగోలు చేసిన మందుల వివరాలను రిజిస్టర్లు నమోదు చేయాలని, రైతులకు రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. రబీ సీజన్‌కు సరిపడిన ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు.