NDL: తెలుగుదేశం పార్టీ సంజామల మండలాధ్యక్షుడిగా ఎగ్గోనికి చెందిన టి. విష్ణువర్ధన్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు మెంబర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. తనపై నమ్మకంతో మండలాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి, విష్ణువర్ధన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.