»Upsc 2023 Final Results Release These Are The Toppers
UPSC 2023 తుది ఫలితాలు విడుదల..టాపర్లు వీళ్లే
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) CSE 2022 పరీక్షకు సంబంధించిన తుది ఫలితాలను అధికారులు ప్రకటించారు. మే 23, 2023న తన అధికారిక వెబ్సైట్ లో రిలీజ్ చేశారు.
UPSC CSE 2022 పరీక్షకు సంబంధించిన ఫలితాలు దాని అధికారిక వెబ్సైట్ https://www.upsc.gov.in/ ద్వారా మే 23, 2023న ప్రకటించారు. ఈ ఫలితాల్లో మొత్తం 933 మంది అభ్యర్థులు చివరకు షార్ట్‌లిస్ట్ చేయబడ్డారని పేర్కొన్నారు. వారిలో 178 మంది అభ్యర్థులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ కోసం రిజర్వ్ లిస్ట్‌లో ఉన్నారని తెలిపారు.
ఈ ఏడాది మొదటి 4 స్థానాలను బాలికలే కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. వారిలో ఇషితా కిషోర్ UPSC CSE 2022 పరీక్షలో అగ్రస్థానంలో నిలువగా, 2వ టాపర్ గరిమా లోహియా అని వెల్లడించారు. UPSC CSE దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
ఇక తెలుగు రాష్ట్రాల నుంచి జీవీఎస్ పవన్ దత్తా 22వ ర్యాంకు సాధించగా, శాఖమూరి శ్రీసాయి అర్షిత్ 40, ఆవుల సాయి కృష్ణ 94, అనుగు శివమారుతీ రెడ్డి 132, రాళ్లపల్లి వసంత కుమార్ 157, కమతం మహేశ్ కుమార్ 200 ర్యాంకులు దక్కించుకున్నారు.
ఈ పరీక్షలో అభ్యర్థుల విజయం వారి కృషి, అంకిత భావం, పట్టుదలకు నిదర్శనం. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వివిధ హోదాల్లో దేశానికి సేవ చేయడానికి ఎంపిక చేయబడతారు. దేశం యొక్క విధానాలు, కార్యక్రమాలను రూపొందించడానికి బాధ్యత వహిస్తారు.
UPSC 2022 తుది ఫలితం pdfని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ https://www.upsc.gov.inక్లిక్ చేయండి.
UPSC మెయిన్స్ ఎగ్జామ్ 2022 సెప్టెంబర్ 16 నుంచి 25, 2022 వరకు జరిగింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలలో విజయవంతంగా ఉత్తీర్ణులైన సుమారు 2,529 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ దశకు షార్ట్‌లిస్ట్ చేయబడ్డారు.