TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒక్కో రౌండ్‌కు 45 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా.. 48.49 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. మొత్తం 7 డివిజన్లలో 1,94,631 ఓట్లు పోలయ్యాయి.