పెద్దపల్లి పట్టణంలోని తెలుగు వాడ ముస్లిం స్మశానవాటిక వద్ద పాత అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కారణంగా ఈరోజు నుంచి రేపటి వరకు రెండు రోజుల పాటు ఆ రహదారి మూసి వేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. ప్రజలు, వాహనదారులు అసౌకర్యం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు. పనులు పూర్తైన వెంటనే రహదారిని తెరుస్తామన్నారు