ADB: రైతుల ఆదాయం పెంచే దిశగా చర్యలు చేపడతామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం గుడిహత్నూర్ మండలం సీతాగొందిలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని కూరగాయాల నర్సరీని పరిశీలించారు. అనంతరం రైతులకు సంకరజాతి కూరగాయల నాట్లను పంపిణీ చేశారు. ఒకే పంటపై ఆధారపడకుండా బహుళ పంటల సాగు విధానాన్ని అనుసరించాలని సూచించారు.