కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం పరిధిలోని బ్రహ్మంగారిమఠం మండల పోలీస్ స్టేషన్‌ను సోమవారం డీఎస్పీ రాజేంద్రప్రసాద్, మైదుకూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివ శంకర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని పలు రికార్డును పరిశీలించి ఎస్సై శివ ప్రసాద్‌కు, పోలీసు సిబ్బందికి తగు సూచనలు, సలహాలు తెలియజేశారు.