కోనసీమ: కపిలేశ్వరపురం మండలం కేదార్లంకలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పుల్లేటికర్రుకి చెందిన నామాడి బన్ను(17) స్నేహితుడు పుట్టినరోజు వేడుక కోసం కేదార్లంక వచ్చాడు. ధనము మర్రి వద్ద గోదావరిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.