Preethi Sister: మెడికో ప్రీతి సోదరికి హెచ్ఎండీఏలో ఉద్యోగం లభించింది. ప్రీతి ఆత్మహత్య అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి.. ఇప్పుడు అందజేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రీతిని సీనియర్ సైఫ్ వేధించిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణలో నిజాన్ని అంగీకరించాడు.
ఫిబ్రవరి 26వ తేదీన ప్రీతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రీతి ఆత్మహత్యకు ర్యాగింగే కారణమని పోలీసులు చెప్పగా.. అతడు ఖండించాడు. తర్వాత విచారణలో అంగీకరించాడు. వాట్సాప్ చాటింగ్ బయటకు తీసి సైఫ్ ఉద్దేశపూర్వకంగా వేధింపులకు పాల్పడ్డారని నిర్ధారించారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల పాటు జరిపిన విచారణలో ఆధారాలు చూపించి సైఫ్‌ను ప్రశ్నించడంతో ర్యాగింగ్ చేయడం నిజమేనని అంగీకరించినట్టు తెలుస్తోంది.
ప్రీతి మృతి కేసు సంచలనంగా మారింది. ఆమె కుటుంబంలో ఒకరికీ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు ఆమె సోదరికి ఉద్యోగం ఇచ్చింది.