TG: బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణకు ఎక్కువ నిధులు వచ్చాయని ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు. రూ.750 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ఆధునీకరిస్తున్నారని చెప్పారు. రూ.300 కోట్లతో చర్లపల్లిలో కొత్త రైల్వేస్టేషన్ నిర్మించారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టి జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలవాలని చూస్తున్నాయని మండిపడ్డారు.