చాలా మంది అన్నం వండిన తర్వాత గంజిని పారబోస్తుంటారు. గంజిలో పోషకాలు ఉంటాయని తెలియదు. చర్మ ఆరోగ్యం, జీర్ణక్రియ, శరీరానికి తగినంత ఎనర్జీ వంటి ప్రయోజనాలు అందిస్తుంది. గంజి చర్మాన్ని కాంతివంతం చేయడానికి, మొటిమలను తగ్గించడానికి కొరియన్, జపనీస్ అందాల సంరక్షణలో ఉపయోగిస్తారు. ఇందులో ఉండే విటమిన్లు, అమైనో ఆమ్లాలు మచ్చలను తొలగిస్తాయి. చర్మాన్ని మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది.