KDP: బద్వేల్ పెద్ద చెరువుకు జలకళ వచ్చింది. ఈ మేరకు బ్రహ్మం సాగర్ నుంచి నీటిని విడుదల చేశారు. ఆ నీరు చెరువుకు చేరడంతో నీటిమట్టం పెరిగింది. దీంతో పరిసరాల్లోని వాగులు, కాలువల నీరు సైతం చెరువులోకి చేరడంతో పూర్తిగా నిండింది. శనివారం ఉదయం నుంచి అలుగు పారుతోంది. దీనిపై ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.