పూరి జగన్నాథ్ ‘లైగర్’ కథను మొత్తం చూపించలేదా.. అసలు లైగర్ కథేంటి.. ఇనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. లైగర్ సినిమా మరో అరగంట ఉందని తెలిసి షాక్ అవుతున్నారు ఆడియెన్స్. భారీ అంచనాల మధ్య విడుదలైన విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్.. ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడానికి శతవిధాలుగా ట్రై చేస్తోంది. అయినా లైగర్‌కు భారీ దెబ్బే పడేలా ఉందంటున్నారు. ముఖ్యంగా ఇది పూరి స్టైల్ సినిమా కాదనే టాక్ జోరుగా నడుస్తోంది. ఇదిలా ఉంటే.. లైగర్ సినిమా రన్ టైం వచ్చేసి రెండు గంటల ఇరవై నిమిషాలు. ఇది ఆడియెన్స్‌ను థియేటర్లో కూర్చోబెట్టే కరెక్ట్ టైం అనే చెప్పాలి. దాంతో లైగర్‌ను షార్ప్ కట్ చేశారని భావించారు అంతా. అయితే లైగర్ సినిమా ఇంకో అరగంట ఉందట. కానీ డ్యూరేషన్ ఎక్కువవుతుందని భావించడం వల్లే.. ఎడిటింగ్‌లో 30 నిమిషాలు లేపేసినట్టు తెలుస్తోంది. అందుకే సినిమాలో కొన్ని చోట్ల లింక్ లేకుండా నెక్ట్స్ సీన్స్ పడ్డాయని అంటున్నారు.
ముందుగా పూరి అనుకున్న ప్రకారం.. హీరో తండ్రితో పాటు హీరో, హీరోయిన్ల మధ్య కొన్ని సీన్స్ రాసుకున్నాడట. అందుకు సంబంధించిన కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. కానీ ఆ సీన్స్‌కు ఎడిటింగ్ టేబుల్ దగ్గర.. కత్తెరకు పని చెప్పినట్టు టాక్. మొత్తంగా లైగర్‌లో అరగంట సీన్స్ కట్ చేశారట. అయితే సినిమా హిట్ అయి ఉంటే.. డిలేటేడ్ సీన్స్‌ను యాడ్ చేసి ఉండేవారేమో.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవడంతో వాటికి మోక్షం లేనట్టేనని అంటున్నారు. అయితే ప్రమోషన్లో భాగంగా.. లైగర్ సీక్వెల్ ఉంటుందని చెప్పాడు పూరి. అందుకే ఆ సీన్స్‌ను పక్కకు పెట్టాడనే సందేహం రాక మానదు. ఏదేమైనా లైగర్ సినిమా మరో అరగంట ఉండి ఉంటే.. ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉండేదో ఏమో..!