MLG: ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామంలో గుడుంబా విక్రయాలపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాజుకుమార్ శుక్రవారం తెలిపారు. దొంగ్రీ రాజశేఖర్ అనే వ్యక్తి గుడుంబా అమ్ముతున్నట్లు గుర్తించి, అతన్ని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. అక్రమంగా గుడుంబా అమ్మినా, నిల్వ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.