MDK: మెదక్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో రాజన్న సిరిసిల్ల జోన్ బాలికల అండర్ 14, 17, 19 విభాగం 11వ జోనల్ మీట్ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడల ప్రారంభోత్సవానికి మెదక్ డీఎస్పి ప్రసన్నకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఐ మహేష్, జోనల్ ఆఫీసర్ ప్రత్యూష, ప్రిన్సిపాల్ పద్మావతి, రఘునందన్, శ్రీనివాస్, సత్యవతి పాల్గొన్నారు.