AP: మన్యం జిల్లా బస్సు ప్రమాదంపై మంత్రి సంధ్యారాణి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం విషయం తెలియగానే మంత్రి ఘటనాస్థలికి అగ్నిమాపక వాహనం పంపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మంత్రికి అధికారులు తెలిపారు. ఘటనపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.