KMR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన జిజ్ఞాస స్టడీ ప్రాజెక్టు పోటీల్లో అర్థశాస్త్ర విభాగంలో ప్రథమ బహుమతి సాధించారు. కళాశాలకు చెందిన విద్యార్థినులు అర్చన, కముస్కాన్, భవిత, సృజన రాణించారు. మహిళలకు ఉచిత బస్సు మహాలక్ష్మి పథకం- జిల్లాలో ప్రభావం అనే అంశంపై రాష్ట్రస్థాయిలో బుధవారం ఉత్తమ బహుమతి అందుకున్నారు.