SKLM: టెక్కలి పట్టణంలోని చిన్న బ్రాహ్మణవీధిలో శ్రీ రాధ మాధవ స్వామి ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి 56 రకాల పిండి వంటకాలతో నైవేద్యం సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.