NTR: విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకల నారాయణ ఆధ్వర్యంలో బుధవారం ఏపీఎస్ఆర్టీసీ బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో విజయనగరం ఆర్టిసీ రీజనల్ ఛైర్మన్ దొన్నుదొర పాల్గొన్నారు. ఈ మేరకు విజయనగరం ఆర్టీసీ రీజన్లోని ఉద్యోగ భద్రత, ఉపాధి అవకాశాలు వంటి సమస్యలపై చర్చించారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ అన్ని రీజియన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు.