W.G: తణుకు ఆంధ్ర షుగర్స్‌లో జరిగిన చోరీకు సంబంధించి ఏడుగురికి బుధవారం రిమాండ్ విధించారు. ఫ్యాక్టరీలో విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు గత నెల 29న ఆంధ్ర షుగర్స్ అదనపు సెక్రటరీ పీవీఎస్పీ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో తణుకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈమేరకు ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.