NDL: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్తీక మాసం అందరికీ శాంతి సౌభాగ్యం, ఆరోగ్యం, తీసుకురావాలని ఆకాంక్షించారు.