కోనసీమ: రాజోలు టీడీపీ ఇంఛార్జ్ గొల్లపల్లి అమూల్య బుధవారం ఉండవిల్లిలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులపై ఈ సందర్భంగా ఇరువురు చర్చించారు. నియోజకవర్గంలో చేపట్టవలసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను అమూల్య మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.