ELR: కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం కైకలూరులో శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శ్యామలాంబ దేవస్థానంలో, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం, ఇతర శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. పుట్లచెరువులో కనకలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించారు.