KKD: పెద్దాపురం రామరావు పేటలో గల శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఉన్న టేబుల్ టెన్నిస్ అకాడమీలో బుధవారం అండర్ 15 మెన్ & ఉమెన్ విభాగాలలో జిల్లా స్థాయిలో జట్లను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని జిల్లా టేబుల్ టెన్నిస్ ప్రెసిడెంట్ సీహెచ్ విజయ ప్రకాష్ సెక్రెటరీ మోహన్ బాబు తెలిపారు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఉదయం 9గంటలకు హాజరు కావాలని ఆయన కోరారు.