TG: పలువురు విద్యుత్ కాంట్రాక్టర్లు, ఉద్యోగులు కుమ్మక్కై ప్రజలను దోచుకుంటున్నారు. కొత్త కరెంటు కనెక్షన్లు, మీటర్లు కేటాయింపు, పాత కనెక్షన్లకు లోడు పెంపు పనుల్లో ఇష్టారీతిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇందుకు అర్హులైన ఫోన్ నంబర్లు రాయకుండా.. సిబ్బంది తమ నంబర్లు ఇచ్చి వసూళ్లకు పాల్పడుతున్నారు. అలా సంగారెడ్డి జిల్లాలో ఒకే నంబరుపై వేల దరఖాస్తులు రావడం గమనార్హం.