కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇవాళ గంగాస్నానంతో పాటు దానధర్మాలు చేయాలి. శివారాధన, రుద్రాభిషేకం, సత్యనారాయణ వ్రతం, ఉపవాసం ఆచరిస్తే శుభఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజు ఇంట్లో ఏ మూలనా చీకటి ఉండకుండా చూస్కోవాలి. వెండి, పాలు దానం చేయకూడదు. ఇంకా మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఇంటికి వచ్చిన పురోహితులను ఖాళీ చేతులతో పంపించకూడదు.