కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ బాలాజీ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనుల నాణ్యత, పనుల వేగం, వివిధ విభాగాల అనుసంధాన అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. నిర్మాణం జరుగుతున్న రన్వే విస్తరణ, టర్మినల్ భవనం పనులు, డ్రైనేజ్ వ్యవస్థ, ప్రయాణికుల వసతుల ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు.