KNR: గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామస్థులు కోతులతో ఇబ్బందులు పడుతున్నారు. కోతులు ఇళ్లల్లోకి చొరబడి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇందుకు పరిష్కారంగా గ్రామ యువకులు రవి, మధు, రాజేంద్ర ప్రసాద్, హరికుమార్, శ్రీను వినూత్నంగా ఆలోచించారు. వానరాలను తరిమికొట్టేందుకు యువకులు రూ.1700 ఖర్చుపెట్టి చింపాంజీ దుస్తులు కొన్నారు. దీంతో కోతుల బెడద లేకుండా నివారించారు.