ATP: శెట్టూరు మండలం మంగంపల్లికి చెందిన టీడీపీ నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుబేర్ యాదవ్ తల్లి ప్రమాదంలో వెన్నెముకకు దెబ్బతగిలి అనంతపురంలోని త్రిపుర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆమెను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.