W.G: నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో శ్రీరామ మందిరం వద్ద శనివారం పరుసు లభించిందని వెంకటాయపాలెం వాస్తవ్యులు పూజారి పాండురంగారావు, చీమల రవి తెలిపారు. నూజివీడు పట్టణంలో సద్ది చేసి తిరిగి వెళుతుండగా రోడ్డుపై కనిపించిన పరుసును నూజివీడు రూరల్ పోలీసులకు అందించినట్లు తెలిపారు. పరుసులో 4200 రూపాయల నగదు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లు చెప్పారు.