పాక్ మాజీ కెప్టెన్, ప్లేయర్ బాబర్ అజామ్ ఇన్నాళ్లూ రోహిత్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును సొంతంచేసుకున్నాడు. సౌతాఫ్రికాతో రెండో T201లో 11 రన్స్ చేసిన ఆతను.. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు. అతను ఇప్పటివరకు 4234 రన్స్ చేయగా.. రోహిత్ 4231 చేశాడు. అటు కోహ్లీ(4188), జోస్ బట్లర్(ENG, 3869) 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు.