కృష్ణా: డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ స్మృతివనం వద్ద కాంట్రాక్ట్ కార్మికులు శుక్రవారం నిరసన తెలియజేశారు. పెండింగ్‌లో ఉన్న తొమ్మిది నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని, తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్‌కు వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే రేపటి నుంచి రిలే నిరాహార దీక్షలకు దిగుతామని కార్మికులు హెచ్చరించారు.