అన్నమయ్య: తంబళ్లపల్లె ST గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి టీచర్లు మందలిస్తారని భయపడి పారిపోయిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మదనపల్లె చీకులబైలుకు చెందిన చరణ్ అనే విద్యార్థి గురువారం రాత్రి స్నేహితుడితో గొడవపడి, శుక్రవారం ఉదయం పాఠశాల నుంచి వెళ్లిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.