MBNR: తెలంగాణ రాజాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం పాలమూరు యూనివర్సిటీని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటీ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా టీఆర్పీ నేతల దృష్టికి తీసుకురావాలని, యూనివర్సిటీ విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మల్లన్న హామీ ఇచ్చారు.