India Plans To Challenge EU Carbon Tax At WTO: Sources
Carbon Tax:ఉక్కు, ఇనుప ఖనిజం , సిమెంట్ వంటి అధిక కార్బన్ వస్తువుల దిగుమతులపై పన్ను విధించనుంది. యూరోపియన్ యూనియన్ 20% నుండి 35% సుంకాలు విధించే ప్రతిపాదనపై ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేయాలని భారత్ యోచిస్తోందని, ప్రభుత్వ వర్గాలు తెలిపాయి . కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కొత్త సాంకేతికతలపై పెట్టుబడులు పెట్టేందుకు స్థానిక పరిశ్రమలను పురికొల్పేందుకు ఈయూ రూపొందించింది.
కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం (CBAM)ని ఎదుర్కోవడానికి భారత్ వ్యూహంలో ఇది భాగం కానుంది. ద్వైపాక్షిక చర్చలలో కూడా ఈ ఈ సమస్యను లేవనెత్తింది. ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించేందుకు, వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి EU నాయకులను కలవడానికి భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ బ్రస్సెల్స్ పర్యటనకు వెళ్లారు.
గ్రీన్హౌస్ వాయువుల నికర సున్నా ఉద్గారిణిగా మారాలనే లక్ష్యంతో స్టీల్, సిమెంట్, అల్యూమినియం, ఎరువులు, విద్యుత్ , హైడ్రోజన్ దిగుమతులను లక్ష్యంగా చేసుకుని, 2026 నుండి అధిక-కార్బన్ వస్తువుల దిగుమతులపై లెవీ విధించే ప్రపంచంలోని మొదటి ప్రణాళికను యూరోపియన్ యూనియన్ గత నెలలో ఆమోదించింది.
“పర్యావరణ పరిరక్షణ పేరుతో, EU ఒక వాణిజ్య అవరోధాన్ని ప్రవేశపెడుతోంది, ఇది భారతీయ ఎగుమతులను మాత్రమే కాకుండా అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలను కూడా దెబ్బతీస్తుంది,” అని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు.