PPM: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనేక జలపాతాలు ఈ జిల్లాలో ఉన్నాయని, వాటన్నింటిని అభివృద్ధి చేసుకుంటూ జలపాతాల జిల్లాగా నమోదు కావడమే తమ లక్ష్యమని జిల్లా కలెక్టర్ డా. ఎస్. ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. మన్యం జిల్లా జలపాతాల జిల్లా అని కితాబిచ్చారు. జిల్లాలో గల అన్ని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసుకుంటూ అన్ని ప్రాంతాలకు గుర్తింపు వచ్చేలాచెయ్యాలన్నారు.