WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన WGL నగరంలోని భద్రకాళి ఆలయానికి ఈరోజు భక్తులు పోటెత్తారు. నేడు కార్తీకమాసం శుక్రవారం కావడంతో వేల సంఖ్యలో భక్తులు ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. పలువురు భక్తులు ఆలయ పరిసరాల్లో సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తుండగా ఆలయం మొత్తం అమ్మవారి నామస్మరణలతో మార్మోగుతోంది.