HNK: పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం చెత్త, వర్షపు నీటితో అధ్వాన్నంగా మారింది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీపావళి పురస్కరించుకొని టపాకాయల దుకాణాలు విక్రయించిన చెత్తను పడవేయడంతో ఇటీవలి వర్షాలకు తడిచి మరింత అధ్వాన్నమైంది. ప్రిన్సిపల్ స్పందించి చెత్త తొలగించే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఇవాళ డిమాండ్ చేశారు