KMM: జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో నలుగురిని DEO కార్యాలయానికి, వయోజన విద్యాశాఖకు ఒకరిని డిప్యుటేషన్ పై ఇటీవల కేటాయించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వారిని డిప్యుటేషన్ చేసి బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వచ్చాయి. దీంతో ఐదుగురు ఉపాధ్యాయులను యథాస్థానాలకు కేటాయిస్తూ అదనపు కలెక్టర్, DEO శ్రీజ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.