సలార్ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఆ లెక్కన సలార్ థియేటర్లోకి రావడానికి ఇంకా పది నెలల సమయం ఉంది. అలాంటిది ఇప్పుడు ఫస్ట్ రివ్యూ రావడం ఏంటనేది.. కాస్త చిత్ర విచిత్రంగానే ఉంది. అంతేకాదు ఆ రివ్యూ ఇచ్చిన వ్యక్తి కూడా అలాంటి వాడే. కానీ అప్పుడప్పుడు ఆయన చెప్పే పది మాటల్లో.. ఒక్కటైనా నిజం అవుతుంది. అందుకే ఆ క్రిటిక్ ఇచ్చిన సలార్ అప్టేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేలా ఉంది. అసలే ప్రశాంత్ నీల్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. కెజియఫ్లో హీరో ఎలివేషన్ చూసి.. సలార్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అందుకే సలార్ నుంచి ఎలాంటి అప్టేట్ వచ్చినా.. క్షణాల్లో వైరల్గా మారుతోంది. చిత్ర యూనిట్ ఇచ్చే అప్టేట్స్ తక్కువే అయినా.. సోషల్ మీడియా టాక్, ఇండస్ట్రీ వర్గాల ప్రకారం సలార్ పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. మధ మధ్యలో ఆ సినిమాలో నటిస్తున్న విలన్లు, మిగతా నటీ నటులు.. సలార్ ఓ రేంజ్లో ఉంటుందని చెబుతున్నారు. ఇక ఇప్పుడు నిత్యం కాంట్రవర్శీ కావాలంటూ.. ఏదో ఒక పుకారు, గాసిప్ క్రియేట్ చేసే.. ఫిల్మ్ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ మెంబర్ ఉమైర్ సంధు.. సలార్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. 30 సెకండ్స్ నిడివి కలిగిన సలార్ రషెష్ చూశాను.. స్పీచ్లెస్, గూస్బంప్స్.. 2023లో ప్రభాస్ సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవుతాడంటూ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. అయితే 30 సెకండ్స్ రషెష్ చూడడమేంటనే డౌట్ రాక మానదు. ఈ లెక్కన ఉమైర్ చెప్పింది టీజర్ రష్ గురించా.. త్వరలోనే టీజర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారా.. అనే సందేహాలు కూడా వెలువడుతున్నాయి. మొత్తంగా సలార్ సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు.