MNCL: వరిలో నల్ల కంకి పురుగు నివారణకు రైతులు స్పైరో మెసిఫేన్ మందును స్ప్రే చేయాలని జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈవో అక్రమ్ సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వరి పంటలో నల్ల కంకి పురుగు ఎక్కువగా ఆశిస్తుందన్నారు. పురుగు గింజల నుండి రసాన్ని పీల్చటం వలన తాలు గింజలు, రంగు మారిన గింజలు తయారవుతాయని.ఆ పురుగు నివారణకు స్పైరో మెసిఫెన్ స్ప్రే చేయాలన్నారు.