WG: ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 37 పునరావాస కేంద్రాల్లో మంగళవారం నాటికి 4,155 మంది బాధితులకు భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 3,581 ఎకరాల వరి పొలాల్లో వర్షపు నీరు చేరిందని, జిల్లాలో తుఫాను కారణంగా 10 గ్రామాలు ముంపునకు గురి కాగలదని గుర్తించామన్నారు