( Vande Bharat Express ) వందే భారత్ రైలుకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది. దీంతో మరిన్ని వందే భారత్ రౌళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందుకుగాను భారతీయ రైల్వేశాఖ (Indian Railway) అధికారులు పనులను ప్రారంభించారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలలో సెమీ హైస్పీడ్ రైలు పట్టాలెక్కిన విషయం తెలిసిందే. రాష్ట్రాలను, నగరాలను కవర్ చేస్తూ 15మార్గాలలో నడుస్తున్నాయి. దీంతో పాటే దేశవ్యాప్తంగా మరో ఐదు రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఇందులో మొదటిది పూరీ – హౌరా మార్గంలో ప్రయాణించనుందని అధికారులు తెలిపారు. ఈ నెలలోనే పచ్చాజెండా ఊపే అవకాశాలున్నాయని చెప్పారు. ఇది ఒడిశాలో ప్రారంభించనున్న మొదటి సెమీ హైస్పీడ్ రైలు అవుతుంది. కాగా… సౌత్ ఈస్టర్ప్ పరిధిలో ప్రయాణించనున్న రెండో రైలు కానుంది.
పూరీ – హౌరా మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని హౌరాలో 5.50 గంటలకు బయలుదేరి ఉదయం 11.50 గంటలకు చేరుతుందని అధికారులు తెలిపారు. రిటర్న్ లో పూరీలో మద్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి రాత్రి 7.30 గంటలకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే… న్యూ జాల్పాయ్గురి – గౌహతి మార్గంలో నడుస్తున్న రైలు ప్రస్తుతం పూరీ – హౌరా మధ్య ట్రయల్ రన్ నిర్శహించారు. ఇది విజవంతమవడంతో ఈ లూన్ లో వందేభారత్ పట్టాలెక్కనుంది. దీని తర్వాత భువనేశ్వర్ – హైదరాబాద్, పూరీ – రాయ్ పూర్, పూరీ – హౌరా మార్గాల్లో మరిన్ని సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే అధికారులు కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు.